ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు 75వ వజ్రోత్సవ జన్మదినం. 75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరుపుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది.


