పుట్టినరోజునే బాబు నిరాహార దీక్ష

Chandrababu One Day Fasting on His Birthday

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుని, సభను సజావుగా సాగనివ్వలేదని విపక్షాల మీదకి నెట్టేస్తూ ప్రధాని మోదీ ఈ నెల 12న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, మోదీ దీక్ష చేపట్టారు. దీని మీద దేశంలోనే కాక అంతర్జాతీయంగా చర్చ నడిచింది. ఏ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏమీ చేయలేని ఒక అసమర్దునిగా ప్రధాని దీక్ష చేపట్టారు. దీని మీద బీజేపీకి బూస్ట్ రాక పోగా దాని మీద ప్రజలకి నెగటివ్ ఒపీనియన్ వచ్చింది. కానీ విషయం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ముందు నుండి అనుకున్నట్టే తన పుట్టున రోజు 20 వ తేదీన చంద్రబాబు నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.

మోదీ తీరును నిరశిస్తూ.. తాను కూడా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20న సీఎం చంద్రబాబు నాయుడి పుట్టి రోజు. అదే రోజున ఆయన నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రత్యేక హోదా మీద కేంద్ర చూపిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిరాహార దీక్ష చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ కూడా మొన్న పార్లమెంట్‌ జరగలేదని నిరాహార దీక్ష చేశారని కాని పార్లమెంట్‌ జరగపోవడానికి అసలు కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిరాహార దీక్షతో కేంద్రానికి తన నిరసన తెలియజేస్తానన్నారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలోని శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని ఆయన జయంతి సందర్భంగా నేడు చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్షని ప్రకటించారు.

భవిష్యత్తులో ఢిల్లీని శాసించేది టీడీపీయేనని, కేంద్రంలో చక్రం తిప్పేది మేమేనని ఇక ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధనలో రాజీపడబోమని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర తెలుగుదేశానిది అని వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మేం మద్దతు ఇచ్చే వ్యక్తే ఉంటారని బాబు అన్నారు. అలాగే తమిళనాడులో కుట్ర రాజకీయాలు చేయాలని బీజేపీ చూసిందని కానీ అక్కడ వారి ఆటలు సాగలేదని ఆంధ్రాలో ఒక అవినీతిపరుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఇదే ఏపీలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల మీద ద్రుష్టి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు నిరాహార దీక్ష పేరుతో నిరసన చేయడం పార్టీ కి, చంద్రబాబు కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక వేళ మోడీని ఎదిరించదానికి జాతీయ రాజకీయాల్లోకి బాబు వెళితే ఇప్పుడు వచ్చే మైలేజ్ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాయి తెలుగుదేశం శ్రేణులు. అందుకే బాబు దీక్ష ని కవర్ చేయడానికి నేషనల్ మీడియా మొత్తాన్ని సమాయత్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ దీక్ష తో అయినా హోదా విషయం లో కేంద్రం దిగివస్తుందేమో చూడాలి మరి.