రేవంత్ కి ఆ ఫోన్ తో జ్ఞానోదయం.

Chandrababu Phone Call to Telangana TDP Senior Leaders Revanth Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇక కాంగ్రెస్ లో చేరడమే మిగిలి వుంది అనుకున్న టైం లో రేవంత్ రెడ్డి హఠాత్తుగా రివర్స్ గేర్ వేసేసారు. తాను టీడీపీ ని వదలడం అంతా మీడియా ప్రచారం మాత్రమే అని ఓ రొటీన్ డైలాగ్ తో ఓ హెవీ సీన్ కి కాస్త లైట్ గా మార్చేశారు. కాంగ్రెస్ లో చేరడానికి డిసైడ్ అయ్యి ఏపీ టీడీపీ నేతల్ని తెరాస తో కలిపి తిట్టేసిన రేవంత్ ఎందుకు ఇలా ప్లేట్ మార్చాడు ? . దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఫోన్ అని అందరికీ తెలిసిందే. ఇంతకీ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబుకి ఏమి చెప్పి వుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. విశ్వసనీయం సమాచారం ప్రకారం ఇలా పార్టీ వదిలివెళ్లిన టీడీపీ నేతలు ఇతర పార్టీల్లో ఎలా బతుకు వెళ్లదీస్తున్నారో తెలుసుకోవాలని మాత్రమే సూచించారట.

నిజమే చంద్రబాబు చేసిన సూచన, చెప్పిన నిజం రేవంత్ కి తెలియంది ఏమీ కాదు. కాకుంటే ఆవేశంలో దాన్ని మర్చిపోయివుండొచ్చు. తెలంగాణ టీడీపీ లో బాబు తమకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని సొంత బలంగా ఊహించుకుని బొక్కబోర్లా పడ్డ నాయకులకి కొదవ లేదు. దేవేందర్ గౌడ్ ఉమ్మడి ఏపీ లో నెంబర్ 2 అనిపించుకున్నారు. ఆ వూపులోనే ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సొంత పార్టీ పెట్టి దాన్ని నడపలేక prp లో చేరి అక్కడా అపజయం పాలై చివరికి టీడీపీ లోనే చేరిన విషయం తెలిసిందే. ఇక దేవేందర్ వెళ్ళాక తెలంగాణాలో పార్టీకి పెద్ద దిక్కు అనుకున్న నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటికీ రాజకీయంగా ఎగుడుదిగుళ్ళ మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు. పేరుకి బీజేపీ లాంటి జాతీయ పార్టీలో వున్నా అక్కడ ఆయన లభించే గౌరవం,విలువ ఏ పాటివో అందరికీ తెలిసిందే. ఇక ఎర్రబెల్లి దయాకరరావు అయితే ఆ ఇద్దరి తర్వాత టీడీపీ లో తన హవా చూపించారు. అయితే తెరాస చేరాక ఆయన పేరు ఎక్కడ వినిపిస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ తెలుసుకుని ఆచితూచి అడుగు వేయమని మాత్రమే చంద్రబాబు సూచించారట.ఏదేమైనా చంద్రబాబు ఫోన్ లో చెప్పిన మాటకు విలువ ఇచ్చి రేవంత్ యూ టర్న్ తీసుకోవడం ఈ నాటి రాజకీయాల్లో కాస్త చెప్పుకోదగ్గది.