పార్లమెంట్ మెట్లకు ఎందుకు మొక్కాల్సి వచ్చిందంటే !

Chandrababu reacts on parliament Steps Touch Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఉద్యమం అనేక మలుపులు తిరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న మంగళవారం ఢిల్లిలో పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరపడం ద్వారా ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చినట్టయింది. ఆయన పార్లమెంటు ప్రవేశ ద్వారం మెట్ల వద్ద వంగి చేతితో తాకి నమస్కరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే అలా చేయడం వల్ల కొన్ని పత్రికలు బాబు ఫోటోల కోసమే ఫోజ్ లు ఇచ్చారని వ్రాశాయి. అయితే పత్రికలలో వచ్చిన ఆ కధనాల మీద చంద్రబాబు స్పందించారు. తాను ఢిల్లీకి వెళ్లి పలు పార్టీల నేతలను కలిసి ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరు గురించి వివరించి చెప్పానని, తాను మొదటి రోజున పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి, అనంతరం పార్లమెంటుకి మొక్కి ముందుకు కదిలానని అలా ఎందుకు మొక్కల్సి వచ్చిందంటే, పార్లమెంటు ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని, అంబేద్కర్‌ ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాశారో ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి మనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొక్కానని అన్నారు.

అంతేగానీ కొంత మంది పేపర్లలో రాయిస్తున్నట్లు తాను వేరే ఉద్దేశంతో అలా చేయలేదని బాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడపాలన్నదే తన ప్రయత్నమని, ఢిల్లీలో పలు పార్టీల నేతలు ఏపీకి అండగా ఉంటామని తనతో చెప్పారని బాబు అన్నారు. టీడీపీకి ఓ విశిష్ట గుణం ఉందని, ఒకసారి ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు పోరాడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరట్లేదని, విభజన చట్టంలో పేర్కొన్నవే అమలు చేయాలని అడుగుతున్నామని అన్నారు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ రక్షణ శాఖకు ఇచ్చే నిధులు కూడా అడుగుతున్నారంటూ ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమయినా పార్లమెంట్ కి మొక్కడంలో తప్పేమీ లేదు ఎందుకంటే సుమారు 120 కోట్ల భారత జానాభా యొక్క ప్రజా ప్రతినిధులు చటాలు చేసే సభ అది, కాని ఆ మెట్లకి నమస్కరిస్తే మోడీ కి నమస్కరించినట్లే అనే వ్యాఖ్యలే బీజేపీ నేతలని అపహాస్యం చేశాయి.