లోకేష్ రాటుదేలాడా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రసంగాలపై ఇప్పటి వరకు జోకులు మీద జోకులు వేసుకునేవారు. ఆయన ప్రసంగాలపై, ఆయన మాటలాడే తెలుగు మీద ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పనిగట్టుకుని మరీ వ్యాఖ్యలు చేసేది. ఆ పార్టీ నేత రోజా అయితే లోకేష్ కి ఒక పేరు కూడా పెట్టేసింది పప్పు అని, కానీ అదంతా ఒకప్పటి మాట గతంకంటే లోకేష్ చాలా మారాడు. పొలిటికల్ పంచ్ లు వేస్తూ పక్క పార్టీ నాయకుల నోటిమాట రాకుండా చేసేంతగా రాటుదేలాడు. గతంలో లోకేష్ ఏమి మాట్లాడినా వివాదాస్పదమే అయ్యేది. చాలా సందర్భాల్లో టీడీపీ కూడా లోకేష్ వల్ల డైలమాలో పడేది. కానీ ఇప్పుడు లోకేష్ ప్రసంగాలల్లో పదును కనపడుతోంది. గతాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ హయంలో ఏమి జరిగిందిన్ తామేం చేశాం, ఇంకేమి  చేస్తాం ఇలా మాట్లాడుతూ తన ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నాడు. 

ఒకప్పుడు జయంతి, బదులు వర్థంతి అని పలికి ఆ రెండిటికీ కూడా తేడా తెలియదా అన్నట్టు మాట్లాడిన లోకేష్ తదుపరి కూడా తన ప్రసంగాల్లో ఎన్నో తప్పులతో దొరికిపోయేవాడు. కరవును తెప్పించడమే తన లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు లేకుండా చేయడమే తన ధ్యేయమని అర్ధం లేని వ్యాఖ్యలతో బాబుకి తలనొప్పిగా మారిన ఆ లోకేష్ ఇప్పుడు తన ప్రసంగంలో తప్పులు ఎంచడం కాదు తాను మాట్లాడే మాటలతో ఎదుటి వారిని ఆలోచనలో పడేస్తున్నాడు. చూడబోతే ప్రసంగానికి ముందు లోకేష్ హోం వర్క్ బాగానే చేస్తున్నట్లు కనపడుతోంది. 
నిన్న తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభలో లోకేష్ తన వాడి వేడి మాటలతో అందరనీ ఆకట్టుకున్నాడు. వచ్చే నలభై ఏళ్లపాటు రాజకీయాలలో ఉంటానని ప్రస్తుతం తన వయసు 34 ఏళ్లు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనే తన ఆకాంక్షని వెలిబుచ్చాడు. అలాగే తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు లాగా నాకు మంచిపేరు వస్తుందో? రాదో? తెలియదు… కానీ, వాళ్లకు చెడ్డపేరు తీసుకురానని హామీ ఇవ్వడం చూస్తుంటే ఆయన రాజకీయాల్లో కాత పరిపక్వత వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేంద్రం చేసిన మోసానికి విరుగుడుగా ఒకవేళ చంద్రబాబు జాతీయ రాజకేయల్లోకి వెళ్ళాల్సి వస్తే రాష్ట్ర రాజకీయాన్ని ఇక లోకేష్ చేతిలో పెట్టేయ్యచ్చు అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.