సూర్యకు స్పెషల్‌ అనుమతి దక్కేనా?

Naa Peru Surya Naa Illu India movie Benefit shows

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ బిజినెస్‌ జరిగింది. ఏపీ మరియు తెలంగాణలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రం బెన్‌ఫిట్‌ షోలను వేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్దం అవుతున్న సమయంలో అనుమతుల విషయంలో కాస్త గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఏదో ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే ప్రత్యేక షోలను అనుమతులు ఇస్తున్నారు. కనుక ఈ చిత్రానికి దక్కడం కష్టమే అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఇక ఏపీలో ఇటీవల వరుసగా పెద్ద సినిమాలన్నింటికి కూడా స్పెషల్‌ షోలకు అనుమతులు ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఇటీవల మెగా ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటుంది. ముఖ్యంగా పవన్‌ ఆ మద్య తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశాడు. ఈ సమయంలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌లు స్వయంగా పవన్‌ను కలిసి మద్దతు తెలిపిన విషయం తెల్సిందే. ఆ కారణంగానే ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వక పోవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటించింది.