మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమా లలో నటించి కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. తన నటనకుగాను ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. చిరంజీవి ప్రతి ఒక్కరితో ఎంత సరదాగా ఉంటాడో అంతే స్ట్రిక్ట్ గా కూడా ఉంటాడు.
తాను అనుకున్నది కచ్చితంగా జరిగి తీరాల్సిందే అని అనుకుంటాడు. అలాంటి చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడట. ఇక రామ్ చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు అతని బాడీ ఫిట్నెస్ పై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడట. ఈ క్రమంలోనే చరణ్ ని నటుడు శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం పంపించారట. అలా రామ్ చరణ్ రెండు రోజుల పాటు శ్రీహరి వద్దకు వెళ్లాడట.
ఇక మూడవ రోజు శ్రీహరి పెట్టే కండిషన్స్ ని భరించలేక… నేను అంత కఠినమైన రూల్స్ పాటించలేనని చిరంజీవి వద్ద ఏడ్చాడట. శ్రీహరి వద్ద ఫిట్నెస్ పాటలు నేర్చుకోవడం చాలా కష్టమని చిరంజీవి వద్ద చెప్పాడట. నన్ను బలవంతంగా పంపించాలని చూస్తే నేను చనిపోతానని చిరంజీవిని రామ్ చరణ్ బెదిరించారట. ఇక ఏం చేయలేక రామ్ చరణ్ చెప్పినట్టుగా చిరంజీవి విన్నాడట. ఇక రామ్ చరణ్ ఫిట్నెస్ కోసం చిరంజీవి ఓ ప్రత్యేక ఫిట్నెస్ కోచ్ ను తన ఇంటి వద్దనే ఏర్పాటు చేసి రామ్ చరణ్ కు ఫిట్నెస్ పాటలు నేర్పించారట.