కరోనా వైరస్ ఎవరూ ప్రశాంతంగం ఉండనివ్వడం లేదు. కరోనా కల్లోలం అంతా ఇంతా అని చెప్పడానికి కూడా సాధ్యం కాని విధంగా జనాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. అలాగే ఈ కరోనా వైరస్ తో అనేక అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
అదేమంటే.. భర్త హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సయయంలో అతడి భార్య ప్రియుడితో వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. కామాతురాణాం నభయం నలజ్జ అంటే ఇదేనేమో. అసలేం జరిగిందంటే.. దేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఏడాది క్రితం భార్య, పిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చాడు. అయితే అతడు మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నాడు. భర్త అడ్డులేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. మరి లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో ఆమె భర్త ఈ నెల 19 శ్రామిక్ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్ చేరుకున్నాడు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోనే పై అంతస్తులో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు.