ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడే చెడ్డీగ్యాంగ్ కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి వేళ చెడ్డీగ్యాంగ్ సభ్యులు తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఖాకీలు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ సభ్యులను గుర్తించారు. అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు పరిశీలించారు.
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి టౌన్ షిప్‌లో చెడ్డీ గ్యాంగ్ సంచరించింది. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడటంతో బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అమీన్‌పూర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెదిరి టౌన్ షిప్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించి అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.