తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాను రెడ్ జోన్ పరిధిలో చేర్చడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో పార్కింగ్ జోన్ల సహాయంతో కెమికల్ స్ప్రే చేస్తున్నారు. ఇందులో భాగంగా నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాగా ఇప్పటికే హైడ్రోక్లోరైడ్ ఫిన్ ను మొత్తం కూడా స్ప్రే చేశారు. రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాలన్నీ ఫైజర్ ఫైరింజన్ల సహాయంతో మొత్తం హైడ్రోక్లోరోఫిల్ ను పిచికారి చేస్తున్నారు. కాగా ఇప్పటికే యాభై అయిదు కేసులు నిజామాబాద్ లో నమోదు కావడంతో ఫైర్ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన అధికారుల సాయంతో.. మునిసిపల్ అధికారులు కూడా అన్ని రెడ్ జోన్ ప్రాంతాల్లో హైడ్రోక్లోరైడ్ ఫిన్ ను పిచికారి చేసేందుకు రంగంలోకి దిగారు. నిజామాబాద్ లో ఇప్పటికే యాభై ఐదు కేసులు, అంటే కామారెడ్డిలో కూడా పన్నెండు కేసులున్నాయి. దీంతో మొత్తం ఉమ్మడి జిల్లాలో అరవై ఏడు కేసు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.