చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన నలుగురిలో ముగ్గురిని గ్రామస్తులు కాపాడగా, యువకుడు మృతిచెందాడు. 18 గంటల తర్వాత మంగళవారం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పళ్లిపట్టు సమీపంలోని వెంకట్రాజుకుప్పానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సాయంత్రం లవ నదిలో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నారు.
వారి కేకలు విన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. గల్లంతైన బాలాజీ కోసం అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పళ్లిపట్టు–షోళింగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకన్నాయి.