దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చెన్నైతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, తిరువణ్ణామలై తదితర ఉత్తర తమిళనాడు జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో సుమారు 7 గంటలపాటు నిరవధికంగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.టి.నగర్, కోడంబాక్కం, ఆదంబాక్కం, పల్లావరం, అంబత్తూర్, కోయంబేడు, అన్నా నగర్, ట్రస్ట్ పురం, కీల్పాక్కం, దాసప్రకాష్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.
రాజధాని నగరంలో సెంట్రల్ రైల్వేస్టేషన్, ఎగ్మూర్, టి.నగర్, మైలాపూర్, పెరంబూర్, రాయపురం, తిరువొత్తియూర్, మాధవరం, పుళల్, అంబత్తూర్, ఆవడి, మొగప్పయిర్, కోయంబేడు, వడపళని, పూందమల్లి, కుండ్రత్తూర్, పోరూర్, క్రోంపేట, పల్లావరం, గిండీ, మేడవాక్కం, వేళచ్చేరి, పెరుంగుడి, షోలింగనల్లూర్, నీలాంగరై, తిరువాన్మియూర్, కోడంబాక్కం, మహాకవి భారతీయార్ నగర్, కొడుంగైయూర్, కీల్పాక్కం, విల్లివాక్కం, కొరట్టూరు, అన్నానగర్, అడయార్, థౌజండ్‌లైట్స్, నుంగంబాక్కం తదితర ప్రాంతాల్లో అతి భారీవర్షం కురిసింది.