ఒక రాష్ట్ర గవర్నర్ గా ఉండి రేపు పంద్రాగస్టు వేడుకల్లో పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించాల్సిన ఆయన రేపు అదే పోలీసుల చేస్తా ప్రభుత్వ లాంచనాలతో సాయుధ గౌరవ వందనం స్వీకరించనున్నారు. కాకపోతే అది నిర్జీవంగా, పూర్తి వివరాలలోకి వెళితే ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్సపొందుతూ రాయ్‌పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుండెపోటురాగా ఆస్పత్రిలో చికిత్సపొంది కాస్త తేరుకున్నారు. మళ్లీ ఇంతలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. దీంతో ఆయన మృతికి చత్తీస్ఘడ్ సీఎం రమణ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఆయన మృతికి గూఉరవ సూచకంగా ప్రభుత్వం వారంపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
1927 నవంబర్ 1న పంజాబ్‌లో జన్మించిన బలరామ్‌జీ దాస్ టాండన్ అమృత్‌సర్‌లో కార్పొరేటర్‌గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత బీజేపీలో ఆయన ఎన్నో పదవులు అధిరోహించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండేళ్లు పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా ఇలా ఆయన తన సేవలను పంజాబ్ రాష్ట్రానికి అందించారు. 2014 ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బలరామ్‌జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మృతికి బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.