చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్నీ తన రెండో భర్త అయిన కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో పిక్ పెట్టిమరీ కంఫర్మ్ చేశాడు. ఈ పిక్ లో శ్రీజ తన బేబీ బంప్ ని చూపిస్తుండగా, కళ్యాణ్ దేవ్ శ్రీజ వైపు చిలిపిగా చూపిస్తూ “శ్రీజ కళ్యాణ్ బేబీ2 లోడింగ్” అని ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఇప్పటికే శ్రీజ కి తన మొదటి భర్త తో కలిగిన తొలి సంతానం నివ్రిత అనే కూతురు ఉంది.తాను ప్రేమ వివాహం చేసుకున్న మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తో త్వరగానే విడాకులు తీసుకొని, సరైన కారణాలు బయటపెట్టకుండానే పుట్టింటికి వచ్చింది. ఆలా వచ్చిన కొన్నాళ్లకే కళ్యాణ్ దేవ్ అనే బిజినెస్ మాన్ కొడుకుతో తో బెంగళూరు లోని చిరంజీవి ఫామ్ హౌస్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ తరువాత శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ‘ విజేత’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. కానీ, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించకపోగా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. కళ్యాణ్ దేవ్ నటన కి మార్కులు అస్సలు పడనేలేదు. ఈ సినిమా పరాజయం నటుడిగా కళ్యాణ్ దేవ్ మరింత సాన పడాలి అని తేలడంతో, ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలతో కులాసా గా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండగా, మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన జంట పెళ్లయి ఆరు సవంత్సరాలు అయిన ఒక్క గుడ్ న్యూస్ కూడా చెప్పడం లేదు. తాము సాధించాల్సింది ఇంకెంతో ఉందని, అప్పటివరకు పిల్లలు గురించి ఆలోచించడం లేదని ఉపాసన పలుసార్లు ఇంటర్వ్యూలలో అయినా జీవితంలో సాధించడానికి పిల్లలు ఏమి అడ్డు పడతారో ఏమో…అదీ మెగా ఫ్యామిలీ వంటి రిచెస్ట్ ఫ్యామిలీ అయ్యుండి ఇలా అనడంలో అంతరార్ధం ఏమిటో…చిన్నాచితక జీతాలతో జీవితాలు వెళ్లబుచ్చే సాధారణ కుటుంబాలే ఇద్దరేసి పిల్లల్ని కని, అచ్చట ముచ్చట తీర్చుకుంటున్నారాయే.