డల్లాస్ లో చిరంజీవికి ఘోర పరాభవం…

Chiranjeevi had Insulted by Dallas People

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మామూలుగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా అమెరికా వెళ్తే అక్కడి వాళ్ళు మనోళ్ళని నెత్తి మీద పెట్టుకుని చూసుకునేవారు. మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ఏ చిన్న ఆర్టిస్టు వచ్చి ఈవెంట్ చేసినా వారు తమ సొంత మనుషుల్లా ఫీలయ్యి మరి ఆ ఈవెంట్ ని సక్సెస్ చేసేవారు. కానీ ఇప్పుడు సాక్షాత్తూ ఎన్టీఅర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లో బిగ్ బాస్ గా ఫీలయ్యే మెగాస్టార్ చిరంజీవి డల్లాస్‌లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటానని… ఈవెంట్లలో పాల్గొంటారని చాలా విస్త్రతంగా ప్రచారం చేసినా ప్రవాసాంధ్రులు పట్టించుకోలేదు సరికదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చిరంజీవి, సినీ ఇండస్ట్రీ అవలభిస్తున్న తీరుకు నిరసనగా చిరంజీవికి అడ్డు తగిలారు.

మా అసోసియేషన్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని డల్లాస్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో చిరంజీవి ఏం చేసారని ప్రశ్నిస్తూ ఎన్నారైలు తమ నిరసన వ్యక్తం చేసారు. హోదా విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ మౌనంగా ఉండటంపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సినీ పరిశ్రమ స్పందించాలంటూ ఎన్నారైలు నిరసనకు దిగిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒకరకంగా చిరంజీవినే మెయిన్ టార్గెట్ చేసిన ఎన్నారైలు కుటుంబ సమస్యల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదా అని ప్రశ్నించారు. ఇండియా నుంచి ‘మా’ అసోసియేషన్ తరఫున భవనం నిర్మించడానికి ఫండ్స్ కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది వచ్చారని… ప్రధానంగా లోటుబడ్జెట్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు హోదా, విభజన హామీల విషయంలో సినీ పరిశ్రమ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తమిళనాడు రాష్ట్రం కావేరి, జల్లికట్టు విషయంలో మొత్తం ఏకమైందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

ఏపీప్రత్యేక హోదా మీద మాట్లాడాలంటూ చిరంజీవిని డిమాండ్ చేశారు ప్రవాసాంధ్రులు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఏపీకి ఏం చేశారని ప్రశ్నించిన వారు… పార్లమెంటులో… పక్క రాష్ట్రాల్లో ఏపీకి మద్దతుగా మాట్లాడుతుంటే… చిరు మాత్రం ఆడియోఫంక్షన్లు… కుటుంబ సభ్యల కోసం ‘మా’ వారిని పోగేసుకెళుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కుటుంబంపైన చూపిస్తున్న శ్రద్ధ ఏపీపై ఎందుకు చూపించటం లేదని ప్రశ్నించారు. పవన్ విషయంలో అందరూ ఒక్కటయ్యారని… కుటుంబ సమస్యల కోసం ‘మా’ అషోసియేషన్‌కు గుంపును పోగేసుకుని వెళ్లినంత శ్రద్ధ… ఏపీపై ఎందుకు చూపడంలేదని మండిపడ్డారు.

చిరంజీవి రాకను వ్యతిరేకిస్తూ వారు నల్ల చొక్కాలతో నిరసన తెలియచేశారు. ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది మరి ఇన్నిరోజులుగా ప్రత్యేక హోదా అంశం మీద రాష్ట్రం అట్టుడికి పోతుంటే బయటకి వచ్చి కనీసం సంఘీభావం తెలియపరచని వ్యక్తి తన తమ్ముడిని ఎవరో ఏదో అన్నారు కాబట్టి వారందరిని బ్యాన్ చేసెయ్యాలని మీటింగ్ లు పెట్టడం చూస్తే అలానే అనిపిస్తోంది. ఇప్పటికయినా చిరంజీవి కాస్త కళ్ళు తెరిచి తానొక రాజ్యసభ సభ్యుడిని అని గుర్తుంచుకుని ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే మంచిది లేకుంటే ఇప్పటికే రాజకేయంగా వ్యక్తిత్వం కోల్పోయిన ఆయన డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.