ఇండస్ట్రీలో అవినీతి లేదనడం అబద్దం

Ram Charan Political Entry KTR Comments Going Viral

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా ప్రత్యేక అతిథిగా హాజరు అయిన రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ కాస్త ఎమోషన్‌ అయ్యాడు. అన్ని రంగాల్లో అవినీతి ఉంటుంది. కాని సినిమా పరిశ్రమలో మాత్రం అవినీతి అనేది ఉండదు అని, అసలు అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే అంటూ రామ్‌ చరణ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం అన్ని వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. రామ్‌ చరణ్‌ పూర్తి అవగాహణ రాహిత్యంతో మాట్లాడాడు అని, ఆయనకు ఇండస్ట్రీలో మొదటి నుండి ఉన్న విభిన్న తరహా అవినీతి ఆయనకు కనిపించడం లేదు అంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు.

అన్ని పరిశ్రమల్లో మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలో కూడా అవినీతి ఉందని, ఇక్కడ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని, చిల్లర అవినీతి ఇండస్ట్రీలో చాలా ఉంటుంది. ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎంపిక చేయాలంటే లేదా జూనియర్‌ ఆర్టిస్టులను ఎంపిక చేయాలంటే దర్శకులు ఎక్కువగా కో ఆర్డినేటర్‌లను లేదా సహాయ దర్శకులపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే కొందరు వాటి కోసం కో ఆర్టినేటర్స్‌కు లంచం ఇవ్వక తప్పదు. ఇలా ఎన్నో ఏళ్లుగా అవినీతి జరుగుతుంది. హీరోల డేట్లు కావాలన్నా, హీరోయిన్స్‌ డేట్లు కావాలన్నా కూడా మేనేజర్‌ల చేతిని తడిపితే వెంటనే జరిగి పోతుంది. ఇది కాదా అవినీతి అంటూ రామ్‌ చరణ్‌ను కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో అవినీతి లేదని రామ్‌ చరణ్‌ చేసిన వ్యాఖ్యలను అంతా కూడా కొట్టి పారేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉండటం వల్ల రామ్‌ చరణ్‌కు అవినీతి గురించి తెలియడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.