చిరంజీవి కాంగ్రెస్ కి ప్రచారం ఖాయం అయినట్టే… !

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో గెలవకున్న పర్లేదు, తెలంగాణ లో గెలిచి తీరుతాం అనుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఆ క్రెడిట్ కాస్త కెసిఆర్ కొట్టేశారు. దీనితో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చిరునామా పూర్తిగా గల్లంతు అయ్యింది. ఈ పరిస్థితి నుండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి తేరుకోలేకపోతుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాల వైఫల్యం, ఏపీ కి ప్రత్యేక హోదా సాధనలో చేసిన నిర్లక్ష్యం, లోకేష్ కుమార్ పై పెల్లుబికుతున్న అవినీతి ఆరోపణలు, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం మరియు అవకతవకలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకతకి కారణం అవుతున్నాయి.

చిరంజీవి కాంగ్రెస్ కి ప్రచారం ఖాయం అయినట్టే... ! - Telugu Bullet

తెలుగుదేశం పార్టీకి ప్రజలలో కలుగుతున్న వ్యతిరేకతని ఇప్పుడైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందుకోసం 2014 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకు దగ్గరైనా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి దింపాలని ప్రణాళిక చేపడుతుంది. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఏపీ పీసీసీ చైర్మన్ రఘువీరా రెడ్డి చెప్పింది ఏమిటంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, రాబోతున్న ఎన్నికలలో ఎన్నికల తేదీ సమయానికి రెండు నెలల ముందునుండే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని.

Chiranjeevi Rahul Gandhi Padyatra

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని రఘువీరా రెడ్డి కంఫర్మ్ చేయడంతో, రాబోతున్న ఎన్నికలు క్రమంగా వేడి ఎక్కడం ఖాయంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటేనే సాధ్యం అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుంది.