Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయస్సులో ఉన్నాడు. ఈ వయస్సులో కూడా ఆయన ప్రేక్షకులను అలరించేందుకు చాలా కష్టపడుతున్నాడు. ‘ఖైదీ నెం. 150’ చిత్రంలో సూపర్ స్టెప్స్‌తో పాటు, మంచి యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఆ సినిమా కోసం హాలీవుడ్ నుండి టెక్నీషియన్స్‌ను పిలిపించడంతో సినిమా ఏ రేంజ్లో తెరకెక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. హాలీవుడ్ ప్రముఖ చిత్రం జేమ్స్‌బాండ్‌లో యాక్షన్ సీన్స్‌ను కంపోజ్ చేసిన గ్రెగ్ పావెల్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చేస్తున్నారు.
యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో చిరంజీవి చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆరు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా గతంలో మాదిరిగా చేయాలి అంటే సాధ్యం అయ్యే పని కాదు. పైగా అద్బుతంగా యాక్షన్ సీన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ నుండి గ్రెగ్ పావెల్‌ను రప్పించడం, ఆయన పాతికేళ్ల కుర్రాడితో చేయించినట్లుగా చిరంజీవితో యాక్షన్ సీన్స్‌ను చేయించేందుకు ప్రయత్నాలు చేయడంతో చిరంజీవి చాలా ఇబ్బంది పడుతున్నాడట. ఆ ఇబ్బంది మొహంపై కనిపించకున్నా కూడా ఆయన ఆఫ్ స్క్రీన్ ప్రవర్తనలో కనిపిస్తుందని అంటున్నారు. చిరంజీవి గతంలో మాదిరిగా ఎక్కువగా అందరితో మాట్లాడకుండా, కాస్త కష్టపడి అలసిపోయినట్లుగా అనిపిస్తున్నాడు. సాదారణ సీన్స్ కోసం రోజులో 8 గంటలు పని చేసే చిరంజీవి ప్రస్తుతం మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే షూటింగ్ చేస్తున్నాడు. అప్పటికే ఆయన చాలా అలసి పోతున్నాడు. యాక్షన్ సీన్స్ సమయంలో పక్కనే ఫ్యామిలీ వైధ్యుడు కూడా ఉంటున్నారు. ఈ వయస్సులో ఇలాంటి పాత్రలు చేయకపోవడం మంచిదని, ఇకపై అయినా వయస్సుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకోవాలని చిరుకు మెగా ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.