పెళ్ళినాటి విషయాలని గుర్తు చేసుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన పెళ్ళినాటి విషయాలని గుర్తు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. తన భార్య సురేఖ ని ఇచ్చి చేసే విషయం లో అల్లు రామలింగయ్య తన గురించి చాల ఆరా తీశారని చిరు అన్నారు. కానీ అపుడే తనకి పెళ్లి చేసుకోవాలని లేదని చిరు ఇంటర్వూ లో అన్నారు. అయితే తన కెరీర్ అపుడే మొదలు కావడంతో వేరే ఆకర్షణలకు లోనవుతానేమో నని భయంతో తమ ఇంట్లో వాళ్ళు బలవంతపు పెళ్లి చూపులకు తీసుకుపోయారని చిరు తెలిపారు.

పెళ్లి కుదిరిన తర్వాత సురేఖతో ఎక్కువగా మాట్లాడలేదని, పెళ్లి విషయం లో కాస్త హడావిడి జరిగిందని చెప్పుకొచ్చారు. తాతయ్య ప్రేమ లీలలు అనే చిత్రంలో అప్పుడు నూతన ప్రసాద్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది అని అన్నారు. నూతన ప్రసాద్ బిజీ ఆర్టిస్ట్ కావడం తో పెళ్లి వాయిదా పడుతుందని అనుకున్నాం అని అన్నారు, కానీ షూటింగ్ ని నిర్మాత వాయిదా వేసి పెళ్ళికి గ్యాప్ ఇచ్చారని అన్నారు. అయితే పెళ్లి పీటల ఫై కూర్చొనే సమయంలో తన చొక్కా చినిగిందని, అన్నారు, సురేఖ చొక్కా ని మార్చుకోవచ్చు కదా అని అడగగా, ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని అన్న విషయాన్నీ తెలిపారు. అలానే తాళి కట్టానని అన్నారు.

అంచెలంచేలుగా ఎదిగిన చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో కీలకంగా మారారు. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో నటించిన చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహ రెడ్డి చిత్రం తో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరు కనిపించనున్నారు.