Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు పది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 2017 సంక్రాంతికి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో ప్రేక్షకలు ముందుకు వచ్చాడు. రాజకీయాల్లోకి వెళ్లినా తాను ఎప్పుడు కూడా సినిమాల గురించి ఆలోచించేవాడిని అని, తన అభిమానుల గురించి ఆలోచించే వాడిని అంటూ ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా చెప్పుకొచ్చాడు. తన అభిమానులను ఇన్నాళ్లు ఎదురు చూసేలా చేసినందుకు గాను ఇకపై సంవత్సరంలో రెండు మూడు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తాను అంటూ చిరంజీవి హామీ ఇచ్చాడు. 2017 సంవత్సరంలో మరో సినిమాను విడుదల చేస్తాను అంటూ అప్పుడే ఫ్యాన్స్‌కు హామీ ఇవ్వడం జరిగింది.
‘ఖైదీ నెం.150’ చిత్రం సమయంలో చిరంజీవి ఇచ్చిన హామీ గంగలో కలిసి పోయింది. అవును, 2017వ సంవత్సరంలో మరో సినిమాను విడుదల చేసి 2018వ సంవత్సరలో రెండు లేదా మూడు సినిమాలు విడుదల చేస్తాను అంటూ చెప్పిన చిరంజీవి మాట తప్పాడు. 2017లో మరో సినిమాను విడుదల చేసిందిలేదు. ఇక 2018 సంవత్సరంలో రెండు మూడు కాదు కదా, కనీసం ఒక్కటి కూడా విడుదల కాదని తేలిపోయింది. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ చిత్రం కోసం సిద్దం అవుతున్నాడు.
వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయట. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. దానికి తోడు కాస్త గ్రాఫిక్స్ వర్క్ కూడా ఈ సినిమాలో ఉండనుందట. అందుకే సినిమా 2018లో విడుదల అవ్వడం సాధ్యం కాదని, 2019 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మెగా ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. వారు చిరంజీవిపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాని చిరంజీవి మాత్రం మంచి సినిమా రావాలి అంటే ఎదురు చూపులు తప్పదు అంటున్నట్లుగా సమాచారం.