Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ పూజా కార్యక్రమాలు జరిగి చాలా నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహనంను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ విడుదల అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంకా కూడా తర్వాత సినిమా ప్రారంభించకపోవడంపై సినీ వర్గాల్లో సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం అవుతుంది. చిరంజీవి సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తాను అంటూ ఖైదీ నెం.150 చిత్రం ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చాడు. కాని ఇప్పుడు చేస్తున్నది మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది.
చిరంజీవి లుక్ ఫైనల్ కాకపోవడంతో చిత్ర షూటింగ్‌ను ఆలస్యం చేస్తూ వస్తున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు చిరంజీవి లుక్ ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం చిరంజీవి వెయిట్ తగ్గించడంతో పాటు, కొత్త హెయిర్ స్టైల్‌ను ప్రయత్నిస్తున్నట్లుగా మెగా వర్గాల వారు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా కోసం చిరంజీవి నూరు శాతం సిద్దం కానున్నాడు. అందుకే తాజాగా చిత్ర రెగ్యులర్ షూటింగ్‌కు డేట్‌ను ఖరారు చేయడం జరిగింది.
డిసెంబర్ 6న హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ సినిమా కోసం వేస్తున్న ఒక ప్రత్యేకమైన సెట్టింగ్‌లో చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. మొదటి షెడ్యూల్లో చిరంజీవితో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతిబాబు మరియు హీరోయిన్ నయనతార నటించబోతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరంలో విడుదల చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది సాధ్యం కాకుంటే 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో మెగా వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.