Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూస్ ఛానల్స్ ని టాలీవుడ్ సినీ పరిశ్రమ నిషేదించనుంది అని ముందు నుంచి వార్తలు వస్తున్నట్లుగా కాకుండా చానల్స్ కి నెమ్మదిగా బిరడా బిగించే పనిలో సినీ పెద్దలు ఉన్నట్టు అర్ధమవుతోంది. తమ ద్వారా, తాము పెంచి పోషిస్తున్న ఇండస్ట్రీ ద్వారా కోట్ల రూపాయలను గడిస్తున్న ఛానళ్లు… టీఆర్పీ రేటింగుల కోసం… తమ పై బురద చల్లే కార్యక్రమాన్ని పదే పదే చేస్తున్నారని అందుకే దాన్ని ఇండస్ట్రీ సీరియస్ గానే తీసుకుందని ఈరోజు రుజువు చేసేశారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు మీడియా సంస్థల్ని బహిష్కరించాలని భావించినా దానికి ఆమోదం లభించలేదు. దీనితో మరో ప్రతిపాదన చేయగా దానికి ఆమోదం లభించిందట. మీడియా ముఖాముఖీ ఇండస్ట్రీ వ్యవహారాల్ని పంచుకోవద్దని, సినిమాలని సొంతంగానే ప్రమోట్ చేసుకోవాలని చిరు సూచించారట.
అదీకాక ఎవరు పడితే వారు వెళ్లి టివి ఛానల్స్ డిబేట్లలో పాల్గొనుతుండడంతో సమస్య మరింత పెద్దదిగా మారుతోంది. మా అసోసియేషన్ సభ్యులందరికి ఇటీవల లెటర్స్ పంపించారట. కేవలం కొందరిని మాత్రమే అధికారిక స్పోక్స్ పర్సన్ లని నియమిస్తామని, మిగిలిన వారెవరూ ఇండస్ట్రీకి సంబందించిన విషయాలని మీడియాతో పంచుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలకి సంబందించిన విషయాలపై పబ్లిక్ తో కానీ… ప్రెస్ మీట్లలో కానీ ఎవరు మాట్లాడాలనే అంశం మీద చర్చలు జరిపి ఫిలిం ఛాంబర్ వర్గాలు… ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతినిధులు… మా అసోసియేషన్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులను కలిపి ఒక కమిటీని ఏర్పారు చేశారు.
ప్రతినిధుల సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి : పి.కిరణ్, అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ – ముత్యాల రాందాస్, గౌరవ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, – కె. మురళీ మోహన్, అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, – సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, – డా.కె.ఎల్.నారాయణ, అధ్యక్షులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, – కొమర వెంకటేష్, అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, – ఆర్.వెంకటేశ్వరరావు, జనరల్ కార్యదర్శి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, – ఎన్.శంకర్, అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, – డాక్టర్ నరేశ్ వి.కె, జనరల్ కార్యదర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, – తమ్మారెడ్డి భరద్వాజ, – వి. వెంకటరమాణారెడ్డి (దిల్ రాజు), – బి.వి. నందిని రెడ్డి, – ఝాన్సీ లక్ష్మి యలవర్తి తదితరులని సభ్యులుగా నియమించారు. వీరు ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్యపైనయినా స్పందిస్తారని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిసింది.