సైరా షాకింగ్‌ న్యూస్‌

Chiranjeevi Sye Raa Narasimha Reddy movie Release Date Fixe in May 2019

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ప్రారంభం అయ్యి నెలలు గడుస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతా సాఫీగా సాగుతున్న ఈ చిత్రం ఇదే సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందేమో అని మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూపులు మరింత కాలం సాగే అవకాశం కనిపిస్తుంది. సైరా చిత్రాన్ని వచ్చే సంవత్సరం మేలో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు గ్యాంగ్‌ లీడర్‌ చిత్రాలు మే 9న విడుదల అయ్యాయి. అలాగే ఈ చిత్రాన్ని కూడా మే 9న విడుదల చేయాలని చిరంజీవి ఆశ పడుతున్నాడు. అందుకే సైరా చిత్రంను మెల్లగా చిత్రీకరణ చేసి 2019 మే 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. సినిమాకు గ్రాఫిక్స్‌ వర్క్‌ దాదాపు నాలుగు నెలలు చేయాల్సి ఉంటుందట. అందుకే సినిమా ఆలస్యం అవుతుందని ఒక వైపు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి వచ్చే సంవత్సరం మే వరకు సైరా రాదు అనే విషయం మెగా ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పుకోవచ్చు.