రంగస్థలం సెట్స్ లో చిరు..!

Chiranjeevi sye raa to use rangasthalam 1985 movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా స్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు,సుదీప్ లు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యుల్ చరణ్ రంగస్థలం సినిమా రూపొందించిన రంగస్థలం విలేజ్ సెట్స్ లో రూపొందించనుంది.

చరణ్ సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతుంది.150కోట్ల భారి బడ్జెట్ తో చిత్రీకరిస్తున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవలే విడుదలయిన రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో ఉన్న సెట్టింగ్ కు మంచి పేరు వచ్చింది. అందుకే ఆ సెట్టింగ్ ను వాడుకోవాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకు చిరంజీవి మరియు చరణ్ లు కూడా ఓకే చెప్పారు. త్వరలోనే రంగస్థలం సెట్స్ కు నరసింహా రెడ్డి వేల్లబోతున్నాడు.