పవన్‌ను కూడా కాస్టింగ్‌ కౌచ్‌లోకి లాగారు

Women Activist about pawan kalyan over casting couch

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం హాట్‌ హాట్‌గా ఉన్న విషయం తెల్సిందే. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అమ్మాయిలను స్టార్స్‌ వాడేసుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి మీడియా ముందుకు రావడంతో పాటు, అర్థనగ్న ప్రదర్శణ చేసిన క్రమంలో వ్యవహారం సీరియస్‌ అయ్యింది. శ్రీరెడ్డికి మద్దతుగా కొందరు, మరి కొందరు ఒంటరి పోరాటం చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంను, తమకు అన్యాయం చేసిన వారిని బజారుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ పేరు కూడా బయటకు వచ్చింది.

పవన్‌ కళ్యాణ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎప్పుడో స్పందించాల్సిందని, ఆయనకు ఇన్నాళ్లకు ఆడవారి కష్టాలు కనిపించాయా అంటూ కొందరు మహిళ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మసాజ్‌ కోసం బెంగాళి అమ్మాయిలు కావాలనే పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ఆడవారి పక్షాన నిల్చుని మాట్లాడటం లేదు అంటూ కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ పేరు కూడా కాస్టింగ్‌ కౌచ్‌లో రావడంతో అంతా షాక్‌ అవుతున్నారు. బెంగాళి అమ్మాయిలతో పవన్‌ మసాజ్‌ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంకా ఎంత మందిఈ వ్యవహారంలో మీడియా ముందుకు వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీరెడ్డి ఉద్యమం తర్వాత కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం తగ్గే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.