మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత వినయ విధేయ రామ్ చిత్రంను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ జరుపుతున్నాడు. చివరి పాటతో కలిపి మూడు గంటలకు పైగా సినిమా నిడివి వచ్చిందని తెలుస్తోంది. సినిమా నిడివి మరీ మూడు గంటలు ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రంను రెండున్నర గంటలకు తగ్గించాలని చిరంజీవి భావిస్తున్నాడట. అయితే చరణ్ గత చిత్రం రంగస్థలం మూడు గంటల పాటు కొనసాగిన విషయం తెల్సిందే. అదే తరహాలో ఈ చిత్రాన్ని కూడా మూడు గంటలు వదిలితే బాగుంటుందని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.
‘వినయ విధేయ రామ’ చిత్రం ఫైనల్ వర్షన్ ఎడిట్ బాధ్యత చిరంజీవి ఎత్తుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి సలహా సూచన మేరకు ఈ చిత్రం ఫైనల్ ఎడిటింగ్ ఉంటుందని సమాచారం అందుతుంది. ఎడిటింగ్ మొత్తం కూడా ఇప్పటికే పూర్తి అయినా కూడా మరోసారి చిరంజీవి జడ్జ్‌మెంట్‌తో సినిమాను ఎడిట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఫైనల్ వర్షన్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ చూసి ఓకే చెప్పిన తర్వాత అప్పుడు సినిమాను విడుదల చేయబోతున్నారు. చరణ్ ప్రతి సినిమాకు కూడా ఇలాగే జరుగుతుంది. ఒక్క రంగస్థలం మూవీకి మాత్రం పూర్తి బాధ్యత సుకుమార్‌పై వేయడం జరిగింది. చరణ్ మూవీ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఈ చిత్రం రీ ఎడిట్ చిరంజీవి ఆధ్వర్యంలో జరుగబోతుంది.