మెగా అల్లుడు నాన్నకు ప్రేమతో..!

Chiru Son in-law Kalyan Dev movie details
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రాకేష్‌ శశి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం ఒక ప్రేమ కథతో తెరకెక్కుతుందని, ఆ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుందని చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మాత్రం ఈ చిత్రంలో ప్రేమ కథ కంటే ప్రధానంగా తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ ఉంటుందని, తండ్రితో తనయుడికి ఉండే అనుబంధంను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

గతంలో తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో సినిమా అనగానే ఈ చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. కళ్యాణ్‌ దేవ్‌కు జోడీగా ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. సాయి కొర్రపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇదే సంవత్సరం చివర్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో కూడా చాలా ఆసక్తి నెకొంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో కళ్యాణ్‌ హీరోగా నిలదొక్కుకుంటాడా లేదా అనేది చూడాలి.