2 లక్షల పైగా రీల్స్‌తో “చుట్టమల్లె” సాంగ్‌ హవా!

"Chuttamalle" song with more than 2 lakh reels!
"Chuttamalle" song with more than 2 lakh reels!

ఈ ఏడాది దేవర నామ సంవత్సరం అని అనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 27, 2024 న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది . ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ లు మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. రిలీజైన రెండు పాటలకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. సెకండ్ సింగిల్ చుట్టమల్లె సాంగ్ కు మాత్రం వేరే లెవెల్లో రెస్పాన్స్ వస్తుంది .

"Chuttamalle" song with more than 2 lakh reels!
“Chuttamalle” song with more than 2 lakh reels!

మిలియన్స్ లో వ్యూస్ వస్తుండగా, రీల్స్ కూడా అదే రేంజ్ లోనే వస్తున్నాయి. దాదాపు 2 లక్షలకి పైగా రీల్స్ వచ్చాయి ఈ పాటకి. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా, శిల్పా రావు వోకల్స్ అందించారు. అనిరుధ్ రవి చందర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.