పోలీసుల అధికారి ఆత్మహత్య విజయవాడలో కలకలం రేపుతుంది.హనుమాన్‌పేట పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సీఐ సూర్యనారాయణ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహించారు. ఏలూరు రేంజ్ అధికారిగా ఉన్న సూర్యనారాయణ ప్రస్తుతం రేంజ్ వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నప్పటికీ ఆత్మహత్యకు వేరే కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్లలో అన్యాయం జరగడంతో మనస్థాపానికి గురయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.సీఐ ఆత్మహత్యపై సందేహాలు వ్యక్తమవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు శాఖ పదోన్నతుల్లో అన్యాయం జరగడమే సూర్యనారాయణ ఆత్మహత్యకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన బ్యాచ్‌కి చెందిన పలువురు అధికారులకు డీఎస్పీలుగా ప్రమోషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు ప్రమోషన్ రాకపోవడాన్ని ఆయన అవమానంగా ఫీలవుతున్నారట. ఉద్దేశపూర్వకంగానే తనకు ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని సీఐ సూర్యనారాయణ కొద్దికాలంగా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.