సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. బిజినెస్‌లో కూడా మంచి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ.. యాడ్స్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సౌత్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఇక థియేటర్స్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ‘AMB’ సినిమాస్ ద్వారా మల్టీప్లెక్స్ & షాపింగ్ మాల్ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ‘AMB సినిమాస్’లో టికెట్ రేట్లు బాగా ఎక్కువే కానీ.. అక్కడ ఉన్న బిగ్ స్క్రీన్ అండ్ లగ్జరీ సీటింగ్‌లో సినిమా చూడటం అనేది ప్రేక్షకుడికి ప్రత్యేక అనుభూతిగా మారింది.
అయితే థియేటర్స్ రంగంలోనే కాకుండా.. ఇప్పుడు వస్త్రవ్యాపార రంగలోకి అడుగుపెడుతున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్వరలో మహేష్ బాబు ‘సూపర్ స్టార్’ బ్రాండ్‌తో షర్ట్స్ మార్కెట్‌లోకి రాబోతున్నాయంటూ మ్యాటర్ లీక్ చేశారు సినీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.మహేష్ బాబు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండటమే కాకుండా.. పద్మాలయ స్టుడియోస్ ఆస్థాన పూజారిగా ఉన్న వేణు స్వామి.. క్రిష్ణ, మహేష్ బాబు సినిమాలకు ముహూర్తాలు పెడుతుంటారు. ఇక మహేష్ బాబు బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టడం కోసం.. ఈయన్ని ముహూర్తం పెట్టమన్నారో ఏమో కానీ.. మ్యాటర్‌ని అయితే ముందే లీక్ చేశారు వేణు స్వామి.
ఇంతకీ ఆయన చెప్పింది ఏంటంటే.. ‘పెళ్లి తరువాత మహేష్ బాబు.. పెళ్లికి ముందు మహేష్.. ఆయన్ని ఇలా రెండు విధాలుగా చూడాలి. పెళ్లికి ముందు మహేష్ బాబు పరిస్థితి ఇలా లేదు.. మహేష్ బాబు పెళ్లికి ముందు ఆయన కెరియర్ బాగుండాలని నేను నా సొంత ఖర్చులతో ప్రత్యేకమైన పూజలు చేశాను.. అప్పట్లో విజయ నిర్మల గారు.. ఐదు తట్టల పూలు.. ఐదు తట్టల పళ్లు పంపించారు.. ఆమె తోటలో పండిన వాటితో పూజ చేశాను.. ఆ పూజలో వైవీఎస్ చౌదరి కూడా ఉన్నారు. అప్పుడే చెప్పా.. ఇక మీ కెరియర్‌కి తిరుగు ఉండదు.. ఎక్కడో ఉంటారని.. అప్పటికి ఆయన రాజకుమారుడు సినిమా చేశారు.
పెళ్లైన తరువాత మహేష్ బాబు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయి.. నిర్ణయాల విషయంలో కమర్షియల్ యాంగిల్‌లో వెళ్తున్నారు. మహేష్ బాబు కొత్తగా బట్టల బ్రాండ్ ఒకటి తీసుకుని వస్తున్నారు. సూపర్ స్టార్ షర్ట్స్.. కొత్త బ్రాండ్ ఒకటి మార్కెట్‌లోకి రాబోతుంది. అవి బయట అమ్మరు.. ఆన్‌లైన్‌లోనే దొరుకుతాయి. మహేష్ బాబు మార్కెటింగ్ బిజినెస్‌లోకి వస్తున్నారు. త్వరలోనే దాని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.
పద్మాలయా స్టుడియోస్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.. చాలా సినిమాలకు నేనే ముహూర్తం పెట్టాను.. కొడుకుదిద్దిన కాపురం.. భారతంలో బాలచంద్రుడు.. ముగ్గురు కొడుకులు సినిమాలకు ముహూర్తం పెట్టాను. అతడు సినిమాలో నేను నటించాను. దాదాపు 10 రోజులు ఆయనతో జర్నీ చేశాను.. ఇప్పుడు ఆయన బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య కలవలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి.అయితే మహేష్ బాబు ఇప్పటికే.. ‘ది హంబల్ కో.’ పేరుతో గార్మెంట్ బ్రాండ్ స్టాపించారు. 2019 ఆగస్టు 7న దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ బ్రాండ్ సామాన్యులకు అందుబాటులోకి అయితే రాలేకపోయింది.