ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఆ దేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపివేయాలని అమెరికన్ బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఐఫోన్‌కు దీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్‌ను వినియోగించాలని తన దేశ పౌరులకు రష్యా పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును అయ్యా టీ1గా రష్యా ప్రకటించింది. ఈ అయ్యా టీ1 ఫోన్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోదట. అయ్యా టీ1 మొబైల్‌ను రష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసిందట.
15 నుంచి 19 వేల రూబుల్స్ విలువ చేసే ఈ ఫోన్ వినియోగదారులపై ఇతరులు నిఘా పెట్టలేరట. తమపై నిఘా పెట్టాలనుకునే వ్యక్తుల ఫోన్ల మైక్రోఫోన్, కెమెరాలను అయ్యా టీ1 స్వయం చాలకంగా టర్న్ ఆఫ్ చేసేస్తుందట. ఇందుకోసం ఈ ఫోన్‌లో ఓ సరికొత్త హార్డ్ వేర్ బటన్ కూడా ఏర్పాటు చేశారట. ఈ ఫోన్ త్వరలో మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచి రష్యన్ తయారు చేసిన అరోరా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయనుందని సమాచారం. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 6.5 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ స్టోరేజీ, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, రెండు ప్రధాన కెమెరాలు, 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.