రూ.56వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Civil Supplies Department in loss of Rs.56 thousand crores: Uttam Kumar Reddy
Civil Supplies Department in loss of Rs.56 thousand crores: Uttam Kumar Reddy

గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

‘‘పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ శాఖ రూ.56వేల కోట్ల నష్టంలో కొనసాగుతోంది. 12 శాతం మంది వినియోగదారులు రేషన్కార్డులు ఉపయోగించలేదు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించాం . కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వ రలో నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తాం . వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తాం ’’ అని ఉత్తమ్ తెలిపారు.