ఏయన్నార్‌ బయోపిక్‌లో నిజం ఎంత?

clarity about about akkineni nageswara rao biopic rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఏపీ మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే చిత్రం తెరకెక్కుతుంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సుధీర్‌బాబు కూడా ఒక బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఇలా పలువురు ప్రముఖులు బయోపిక్‌లు టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులు కూడా తమ కుటుంబ పెద్ద అయిన అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను స్వయంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

అక్కినేని బయోపిక్‌లో యంగ్‌ ఏయన్నార్‌గా చైతూ, సీనియర్‌ ఏయన్నార్‌గా నాగార్జున నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అక్కినేని కుటుంబంకు సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లే అని చెప్పుకొచ్చాడు. నాగార్జున వద్దకు ఒక దర్శకుడు ఏయన్నార్‌ బయోపిక్‌ స్క్రిప్ట్‌ను తీసుకు వచ్చిన మాట వాస్తవమే కాని నాగార్జున ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అంటూ చెప్పాడని తెలుస్తోంది. నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరు కూడా నాగేశ్వరరావు జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించేందుకు ఆసక్తిగా లేరు అని తెలుస్తోంది. ఏయన్నార్‌ జీవితంను ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఏ ఒక్కరి వల్ల కాదని, అందుకే తప్పుగా చూపిస్తే ఆయన అభిమానులు నిరుత్సాహపడుతారు. అందుకే ఆ ఆలోచన చేయలేం అంటూ వారు చెబుతున్నారు.