పవన్ కల్యాణ్ అభిమానులతో దూరాన్ని, వైరాన్నీ పెంచుకున్నాడు అల్లు అర్జున్. ఆ ఒక్క మాట బన్నీని చాలా ఇరకాటంలో పెట్టేసింది. ఆ తరవాత చాలా కాలం పాటు ఈ దూరం కంటిన్యూ అయ్యింది. ఆమధ్య ఓసారి ఫిల్మ్ చాంబర్‌లో పవన్ కల్యాణ్ వీరంగం సృష్టించడం, పవన్‌కి అండగా బన్నీ వెళ్లి ఓ హగ్ చేసుకోవడం, నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్ అతిథిగా రావడం ఇవన్నీ చూసి ఇద్దరి మధ్య మళ్లీ అనుబంధం చిగురించింది, పాత విషయాలన్నీ పక్కన పెట్టేయొచ్చు అనుకున్నారు. కానీ.. వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గలేదని ‘అల వైకుంఠపురముల’` ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరోసారి నిరూపించింది.
బన్నీ మాట్లాడుతున్నప్పుడు చుట్టు పక్కనున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ బన్నీని విసిగించారు. దాంతో.. ‘మీఅందరి కోసం పవర్ స్టార్ గారూ.. అంటాను. కానీ ఈ కట్టె కాలేంత వరకూ చిరంజీవి అభిమానినే’ అంటూ ఆ ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చాడు బన్నీ. నిజానికి చుట్టు పక్కల ఎంత గొడవ చేస్తున్నా బన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ‘మీ అందరికోసం పవన్ మాటెత్తుతున్నా.. లేదంటే ఎత్తేవాడిని కాను’ అన్నట్టుంది బన్నీ స్టేట్ మెంట్. ‘నాకు చిరంజీవి అంటే ప్రాణం..’ అని చెప్పినా సరిపోతుంది. దాని కోసం పవన్ మాట ఎత్తాల్సిన అవసరమే లేదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మీ అందరికీ పవర్ స్టార్ దేవుడు కావొచ్చు.. నాకు మాత్రం కాదు అని చెప్పకనే చెప్పినట్టు కదా? మొత్తానికి మరోసారి బన్నీ స్పీచు, ఇచ్చిన స్టేట్‌మెంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని హర్ట్ చేసేలానే ఉన్నాయి.