క్లీన్ అండ్ గ్రీన్ & బ్యూటిఫుల్ వాష్ లెట్

toto-washlet-s300-toilet

Posted [relativedate]

clean beautiful washletమ‌రుగుదొడ్డికి వెళ్తే ఎంత త్వ‌ర‌గా అక్క‌డ్నుంచి బ‌య‌ట ప‌డ‌తామా అన్న‌ట్టు ఉంటుంది చాలామంది ఫీలింగ్. ఎందుకంటే సాధార‌ణంగా మ‌రుగుదొడ్లు అంత క్లీన్ గా ఉండ‌వు. కంపు కొడుతుంటాయి. కానీ ఇప్పుడు కొత్త వాష్ లెట్ అందుబాటులోకి రాబోతున్న‌ది. ఒక‌సారి అక్క‌డికి గానీ వెళ్తే బ‌య‌ట‌కు రావాలంటేనే ఆలోచిస్తార‌ట‌. అంత సుఖ‌వంతంగా… సౌక‌ర్య‌వంతంగా.. అందులోనూ సువాస‌న‌లు వెద‌జ‌ల్లేలా ఉంటుంట‌. ఆహా అని మ‌న‌ల్ని మ‌న‌మే మైమ‌ర‌చిపోతామ‌ట అక్క‌డికి వెళ్తే. పూర్తిగా రోబో టెక్నాల‌జీ, స్పెన్స‌ర్ల‌తో త‌యారైత ఈ వాష్ లెట్ ను జపాన్ కు చెందిన పారిశుధ్య ఉత్ప‌త్తుల దిగ్గ‌జం టోటో త‌యారు చేసింది.

ఈ సువాస‌న‌ల వాష్ లెట్ లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. వాష్ లెట్ మూత దానంత‌ట అదే తెరుచుకుంటుంది. రిమోట్ కంట్రోల్ సాయంతో మ‌న కూర్చునే ఆస‌నాన్ని ఎంత వేడిగా కావాలంటే అంత వేడిగా సెట్ చేసుకోవ‌చ్చు. ఇక అక్క‌డ కూర్చున్నంత సేపు ఆ కుండీలో నుంచి సువాస‌న‌లు వ‌చ్చేలా డిజైన్ చేశారు. అంతేకాదు ప‌ని పూర్త‌య్యాక క‌డుక్కోవ‌ల‌సిన అవ‌స‌ర‌మే లేదు. టిష్యూ అంత‌కంటే అవ‌స‌రం లేదు. రిమోట్ పై ప్రెస్ చేస్తే చాలు… కుండీలో ఉండే రోబో గొట్టి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ ప‌ని చేసేస్తుంది. అంతేకాదు త‌డిని పీల్చేసి… చ‌ర్మాన్ని పొడిగా మార్చే డ్ర‌య‌ర్ సౌక‌ర్యం కూడా అందులో ఉంది. ఇలా మ‌నం చేతికి నీటిచుక్క కూడా అంట‌కుండా ప‌నంతా అయిపోతుంది. ఇక ఆ త‌ర్వాత కూడా వాష్ లెట్ ప‌ని కొన‌సాగుతుంది. కుండీ మూత‌ప‌డి … నీళ్లు వాటంత‌ట అవే వ‌చ్చి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపేస్తాయి. ఇలా వాష్ లెట్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది.

సువాస‌న‌లు గ‌ట్రా బాగానే ఉన్నాయి. కానీ దీని రేటెంతో తెలిస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే. అక్ష‌రాలా ఎనిమిదిన్నర ల‌క్ష‌ల రూపాయ‌లు. మ‌రి సుఖంగా.. సౌక‌ర్య‌వంతంగా… ప‌ని జ‌ర‌గాలంటే ఆ మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌దంటోంది స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం.