15 నుంచి మళ్లీ లాక్ డౌన్.. ? కేంద్రం క్లారిటీ

కరోనా విషయంలో మార్చి నెలలో వెంటనే లాక్ డౌన్ ను విధించిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తుందా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది. రోజు రోజుకీ భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మళ్లీ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోనుందా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. లాక్ డౌన్ తర్వాత క్రమంగా ఇచ్చిన సడలింపులతో మళ్లీ కరోనా ఊపందుకుంది.

అయితే ఇలాంటి సమయంలో కేంద్ర తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు భారీఎత్తున పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి విస్తృతమౌతున్న ఈ సమయంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. న్యూస్ దొరికితే చాలు వైరల్ చేసే నెటిజన్లు… మళ్లీ లాక్ డౌన్ అంటూ సాగుతున్న ప్రచారం విపరీతంగా చేస్తున్నారు.

అదేవిధంగా అవి గాలి కబుర్లేనని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఉద్దేశమేమీ లేదని తెలిపింది. ఈ నెల 15 నుంచి మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ కొన్ని వార్తలు పుట్టుకు రావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని తెలిపింది. అందుకు సంబంధించి.. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. దీంతో మళ్లీ పుర్తిస్థాయిలో లాక్ డౌన్ లేదని కేంద్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది.