తాజాగా పరిశోధనలలో న్యూజెర్సీకి చెందిన క్లైమేట్ సెంట్రల్ అనే సైన్స్ ఆర్గనైజేషన్ భారత ఆర్థిక రాజధాని ముంబయి గురించి పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియచేసింది. 2050 నాటికి ముంబయిలో చాలా భాగం సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో మునిగిపోయే అవకాశం ఉందని ఈ పరిశోదనలో తెలిపింది. తీర ప్రాంతాలపై పరిశోధనలుచేసి న్యూజెర్సీకి చెందిన క్లైమేట్ సెంట్రల్ అనే సైన్స్ ఆర్గనైజేషన్ ఒక కథనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ పేరుతో ప్రకటించింది.
2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ కిందకు కుంగి పోయే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర మట్టాలు రోజు రోజుకి పెరుగుతు ఉండడం వల్ల భూమి హైటైడ్ లైన్ కుంగి పోవడానికి కారణం అని తెలిపారు.
ముంబయిలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు చెరిగి పోయే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో తెలిసింది. పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు ఇంకా వాణిజ్య ప్రాంతాలు విస్తరించడం ముంబయి నగరానికి ఉన్న ముప్పు అని పేర్కొన్నది. ముంబయి అంతా ఒకప్పుడు ద్వీపాలలో కలిసి ఉండేది. అన్నింటినీ కలిపి ముంబయి నగరంగా వెలిసింది. అంతర్జాతీయ వలసల సంస్థకు చెందిన డైనా లొనెస్కో మాట్లాడుతూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటి నుండే ముందు జాగ్రత్తలు తీస్కోవాలంటూ తీర ప్రాంత ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలి అని చెప్పారు.