ట్రంప్ టారిఫ్‌లతో ఏపీ రొయ్య విలవిల్లాడుతోంది. సుంకాల ప్రభావంతో ధరలు దిగజారడం, ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టడంతో.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులతో రివ్యూ జరిపారు. ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్ రొయ్యల ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని.. సీఎం ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఆక్వా అసోసియేషన్ ప్రతినిధులు. రైతులు నష్టపోకుండా.. వంద కౌంట్ రొయ్యకు 220 రూపాయల ధరను ఫిక్స్ చేశారు. రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు






