ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. ఏపీ కి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించనున్నారు. మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబు.. ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు మోదీతో చర్చించనున్నారు.





