ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇటీవల ప్రధాని మోదీనీ కలిసి వచ్చిన జగన్ మరోసారి ఆయనతో భేటీ కానున్నారు. అయితే ఈసారి ప్రధానితోపాటు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా కోరారు. దీనిని బట్టి చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లోనే జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశముందని సమాచారం. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలపై జగన్ ఫిర్యాదు జాతీయ స్థాయిలో వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో జగన్ మరోసారి ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరడం చర్చానీయాంశంగా మారింది. అయితే ఇంతకు ముందు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అంశం, రాష్ట్రానికి కేంద్ర సాయంగా ఇవ్వాల్సిన నిధులపై సీఎం జగన్ ఇదివరకే ప్రధానితో చర్చించారు. అయితే ప్రధానంగా వైసీపీని బీజేపీ NDA కూటమిలోకి ఆహ్వానిస్తుందన్న టాక్ మరో పక్క బలంగా వినిపిస్తుంది.