కత్తికి 17 లక్షల సాయం చేసిన జగన్

కత్తికి 17 లక్షల సాయం చేసిన జగన్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ చికిత్స కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌)నుంచి ఈ నగదు అందించారు.

ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.