ఆంధ్రప్రదేశ్ కి రాజదానిని అమరావతి నుండి తొలగించి, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇటీవల తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం వలన, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇప్పటికే అమరావతి ప్రాంతానికి చెందిన రైతులందరూ కూడా పలు నిరసన జ్వాలలు రగిలిస్తూ, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఈ అమరావతిలోని రైతులందరికీ కూడా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలందరూ మద్దతు ప్రకటిస్తూ, వారు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు…
ఈ నేపథ్యంలో సీఎం జగన్ అమరావతి విషయంలో మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని సమాచారం. కాగా రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏమాత్రం సరిపోదని, రాజధానిని నిర్మించాలంటే దాదాపుగా లక్ష కోట్లు అవసరమని ఉందని ప్రకటించిన జగన్, అమరావతి కంటే విశాఖ లో పరిపాలన సాగించి, విశాఖ నగరాన్ని డెవలప్ చేయాలనీ భావిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటి వరకు అమరావతిలో కట్టిన భవనాల పరిస్థితి ఏంటని వచ్చిన ఆలోచనలో భాగంగా సీఎం జగన్ దగ్గరికి ఒక కీలకమైన ప్రతిపాదన వచ్చిందని సమాచారం. అయితే అమరావతిలో రాజధాని నిర్మాణానికని సేకరించిన భూములన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవే…
అయితే రైతుల దగ్గర తీసుకున్న భూముల దృష్ట్యా అమరావతిని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా ప్రకటిస్తే అందరికి లాభం చేకూరుతుందని కొందరు నిపుణులు సూచించారని సమాచారం. అందుకని ఇప్పటికే సీఎం జగన్ వద్దకు, దానికి సంబందించిన నివేదిక కూడా చేరిందని సమాచారం. అంతేకాకుండా పెరుగుతున్న జనాభా దృష్ట్యా, వ్యవసాయం మనకు చాలా ముఖ్యమని, అందుకనే అమరావతిని విలువైన పంటల హబ్ గా మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారట. మరి సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన అమరావతిలోని రైతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి…