ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో తరచూ ఆయన న్యాయస్థానానికి హాజరు కాలేదు. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోర్టును కోరారు. అయితే.. అందుకు ప్రతికూల తీర్పులు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన.. ఈ రోజు హైదరాబాద్ లోని కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.
అయితే.. ఈ రోజు హైదరాబాద్ కు రావాల్సిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు అయ్యింది. సీబీఐ.. ఈడీ కోర్టుల న్యాయమూర్తి సెలవులో ఉండటం కారణంగా.. ఈ రోజు విచారించాల్సిన కేసులు వాయిదా పడ్డాయి. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా సీఎం జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో.. సీఎం జగన్ తాడేపల్లిలోనితన క్యాంపు కార్యాలయంలోనే ఉంటారని చెబుతున్నారు.