ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ రాష్ట్రంలో అధికార గర్వంతో విర్రవీగుతున్నాడని, తాను ఏమి చేసిన కూడా చెల్లుతుందన్న గర్వంతో తన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని యనమల పలు విమర్శలు చేశారు. కాగా రాష్ట్రంలో గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రవర్తించిన తీరు జగన్ అహంభావానికి అద్దంపట్టిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ తప్పుడు మాటలతో మభ్యపెట్టి, ఇపుడు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంతోనే మాటలు మారుస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలనే జగన్ గారి సొంత పత్రికైనటువంటి సాక్షి లో ప్రచురించినప్పటికి కూడా సీఎం జగన్ ఆ పత్రికలను కూడా తప్పు బట్టారు. కాగా తాను ఇచ్చిన హామీలు వేరని, పత్రిక ప్రచురించిన కథనాలు వేరని సీఎం జగన్ మాటలు మార్చుతున్నారని యనమల ఆరోపిస్తున్నారు. కాగా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొని ఆరు నెలలు పూర్తయినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికి అవసరమయ్యేలాగా ఇంతవరకు కూడా ఎలాంటి సహాయ సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.