ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చే విషయంలో ఎవరి మాట వినేలా కనిపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుండి మార్చేసి విశాఖలో పరిపాలక రాజధానిని ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సీఎం జగన్ వైజాగ్ని పరిపాలక రాజధానిగా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈమేరకు అందరిని ఆశ్చర్యపరిచేలాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు.
కాగా తాజాగా విశాఖలో రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ జరగనుంది. కాగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకే సీఎం జగన్ విశాఖ కి వెళ్తున్నారని సమాచారం. ఇకపోతే కైలాస గిరిపై రూ.37 కోట్లతో ప్లానెటోరియం ఏర్పాటు పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి పునాది రాయి వేయనున్నారు. ఉడా సెంట్రల్ పార్కులో రూ.380 కోట్లతో VM RDA పనులు, రూ.800 కోట్లతో GVMC పనులకు సీఎం శంకుస్థాపన చేయడానికి సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈమేరకు సీఎం జగన్ నేటి విశాఖ పర్యటనకు సంబంధించి వైసీపీ వర్గాలు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తీ చేశాయి…