ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్

ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్

రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన పార్టీ లు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాత్రం నిద్ర పట్టనివ్వడం లేదు. అవినీతి రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ ని తీర్చి దిద్దుతాని తెలిపిన జగన్ మొదట కొత్త ఇసుక పాలసీ ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఇసుక ద్వారా టీడీపీ నేతలు అవినీతి చేసారని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ని పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా డబ్బులు తీసుకొనే వారికీ చెక్ పెట్టారు ముఖ్యమంత్రి జగన్. అంతేకాకుండా ఈ నిర్ణయం తో పేద ప్రజలు, స్తోమత లేని వారు ఇక ఆంగ్ల మాధ్యమం లో చదివించడానికి వెనకాడాల్సిన అవసరం లేదు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఫై ఆరోపణలు చేసారు. భూ మాఫియా జరిగిందని, ముందుగానే ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని తమ బందువులకు, మిత్రులకు తెలియజేసి, అక్కడ భూములు కొనుగోళ్లు బినామీల రూపంలో జరిగాక రాజధానిని అమరావతి గా ప్రకటించారని అన్నారు. అయితే ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయం తో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. ఇలా జరగడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.