ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మరోసారి మంత్రివర్గ కూర్పుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. సీఎం జగన్ తుది జాబితా తయారీపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.
అయితే, పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండనుంది. కేబినెట్లో 10 మంది పాత మంత్రులే కొనసాగే అవకాశం ఉండగా.. కొత్తగా మరో 15 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం వరకు ఫైనల్ లిస్ట్‌ను సిద్ధం చేసి తర్వాత జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించనున్నారు.