నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్‌

Jagan government's key decision for sports..!
Jagan government's key decision for sports..!

నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సందర్బంగా మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. హెలీప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభించనున్న జగన్.. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ముఖ్య0గా యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ. ఫార్మా, బయెటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌.

యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు లారస్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకు కూడా భూమి పూజ నిర్వహించనున్నారు.