హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ మరోసారి కరీంనగర్‌లో పర్యటించనున్నారు. గురువారం రాత్రి హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. తర్వాత రోడ్డు మార్గంలో కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న నివాసానికి చేరుకుని బస చేశారు.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అలుగునూరులో జరిగే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్‌ కుమా ర్తె వివాహానికి కేసీఆర్‌ హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్‌ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ‘దళితబంధు’పథకంపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.