దేశ ఖజానాలో తెలంగాణ సొత్తు కూడా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ ఖజానా నీ అయ్య సొత్తు ఏమి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్ధేశించి మండిపడ్డారు. తన ఫాంహౌజ్‌ను దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా అని చురకలంటించారు. తమకు మనీలాండరింగ్‌లు లేవని.. కంపెనీలు లేవు, బిజినెస్‌లు, దందాలు లేని స్పష్టం చేశారు. బీజేపీ తమను ఏం చేయలేరని, వారి బెదిరింపులకు భయపడమని పేర్కొన్నారు. తాము ఎవరితోనైనా, ఎంత దాకా అయినా పోరాడతామని స్పష్టం చేశారు.
‘ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా దళితున్ని సీఎంను చెస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు. నేను మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆమెదించారు కదా.. దళితుణ్ని సీఎం చేస్తానని చెప్పి చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మేమే దళితున్ని సీఎంని చేయనివ్వలేదని షబ్బీర్ అలీయే చెప్పారు. ఆ తరువాత కూడా ప్రజలు నా నిర్ణయాన్ని ఆమోదించారు. తెలంగాణకు బీజేపీ, బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలి. దేశంలో ఏ వర్గం ప్రజలకు, ఏ జాతికి మీరు మేలు చేశారు. మేము లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 78 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నం.’ అని పేర్కొన్నారు.